అల్-ముఖ్తసర్
وَلَا تَقُولُوا۟ لِمَا تَصِفُ أَلْسِنَتُكُمُ ٱلْكَذِبَ هَـٰذَا حَلَـٰلٌ وَهَـٰذَا حَرَامٌ لِّتَفْتَرُوا۟ عَلَى ٱللَّهِ ٱلْكَذِبَ ۚ إِنَّ ٱلَّذِينَ يَفْتَرُونَ عَلَى ٱللَّهِ ٱلْكَذِبَ لَا يُفْلِحُونَ ﴿١١٦﴾
ఓ ముష్రికులారా అల్లాహ్ నిషేధించని వాటిని నిషేధించి,ఆయన ధర్మసమ్మతం చేయని వాటిని ధర్మసమ్మతం చేసి మీరు అల్లాహ్ పై అబద్ధమును కల్పించే ఉద్ధేశముతో ఈ వస్తువు ధర్మ సమ్మతం,ఈ వస్తువు నిషేధం అని మీ నాలుకలు పలికిన అబద్ధమును అల్లాహ్ పై పలకకండి.నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ పై అబద్ధమును కల్పిస్తారో వారు తాము ఆశించిన వాటితో సఫలీకృతం కారు,భయం నుండి వారికి విముక్తి లేదు.