×
النحلఆయత్ 26

అల్-ముఖ్తసర్

قَدْ مَكَرَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ فَأَتَى ٱللَّهُ بُنْيَـٰنَهُم مِّنَ ٱلْقَوَاعِدِ فَخَرَّ عَلَيْهِمُ ٱلسَّقْفُ مِن فَوْقِهِمْ وَأَتَىٰهُمُ ٱلْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ ﴿٢٦﴾

నిశ్చయంగా వీరందరికన్న ముందు అవిశ్వాసపరులు తమ ప్రవక్తల కొరకు కుట్రలు పన్నారు. అప్పుడు అల్లాహ్ వారి కట్టడములను వాటి పునాదులతోసహా శిధిలం చేశాడు. అప్పుడు వాటి పైకప్పులు వారిపై పడ్డాయి. వారు ఊహించని చోటు నుండి శిక్ష వారిపై వచ్చి పడింది. వాస్తవానికి వారి కట్టడాలు వారిని రక్షిస్తాయని వారు భావించేవారు. కాని వారు వాటి ద్వారానే తుదిముట్టించబడ్డారు.