×
النحلఆయత్ 28

అల్-ముఖ్తసర్

ٱلَّذِينَ تَتَوَفَّىٰهُمُ ٱلْمَلَـٰٓئِكَةُ ظَالِمِىٓ أَنفُسِهِمْ ۖ فَأَلْقَوُا۟ ٱلسَّلَمَ مَا كُنَّا نَعْمَلُ مِن سُوٓءٍۭ ۚ بَلَىٰٓ إِنَّ ٱللَّهَ عَلِيمٌۢ بِمَا كُنتُمْ تَعْمَلُونَ ﴿٢٨﴾

ఎవరినైతే దైవదూతల్లోంచి మరణ దూత,అతని సహాయకులు వారి ఆత్మలను తీస్తారో,వారు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచి తమపై హింసకు పాల్పడ్డారు. వారిపై మరణం తాండవించినప్పుడు లొంగిపోయి విధేయత చూపుతారు. మరియు వారు పాల్పడిన అవిశ్వాసమును,పాపకార్యాలను నిరాకరిస్తారు వారి నిరాకరణ వారికి ప్రయోజనం చేకూరుస్తుందని భావించి. వారితో ఇలా పలకబడుతుంది : మీరు అబద్దం పలుకుతున్నారు. మీరు అవిశ్వాసపరులై ఉండేవారు మీరు పాల్పడిన పాపకార్యాలు మీకు తెలుసు. నిశ్చయంగా మీరు ఇహలోకంలో పాల్పడే వాటి గురించి అల్లాహ్ కి తెలుసు. వాటిలో నుంచి ఏవీ ఆయనపై గోప్యంగా లేవు. వాటి పరంగా వారికి ఆయన తొందరలోనే ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.