అల్-ముఖ్తసర్
وَقَالَ ٱلَّذِينَ أَشْرَكُوا۟ لَوْ شَآءَ ٱللَّهُ مَا عَبَدْنَا مِن دُونِهِۦ مِن شَىْءٍ نَّحْنُ وَلَآ ءَابَآؤُنَا وَلَا حَرَّمْنَا مِن دُونِهِۦ مِن شَىْءٍ ۚ كَذَٰلِكَ فَعَلَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ فَهَلْ عَلَى ٱلرُّسُلِ إِلَّا ٱلْبَلَـٰغُ ٱلْمُبِينُ ﴿٣٥﴾
తమ ఆరాధన విషయంలో అల్లాహ్ తోపాటు ఇతరులను సాటి కల్పించేవారు ఇలా పలికారు : ఒక వేళ అల్లాహ్ మేము ఆయన ఒక్కడినే ఆరాధించాలని,మేము ఆయన తోపాటు సాటి కల్పించకూడదని తలచుకుంటే మేము ఆయనను వదిలి ఇతరులను ఆరాధించేవారము కాదు. మేమూ కాదు,మా కన్న మునుపటి మా తాత ముత్తాతలూ కాదు. ఒక వేళ మేము దేనినీ నిషేధించకూడదని ఆయన తలచుకుంటే మేము నిషేధించేవారము కాదు. మునుపటి అవిశ్వాసపరులు ఇటువంటి అసత్య ఆధారాలతో పలికేవారు. దైవ ప్రవక్తలు ఏ సందేశాలను చేరవేయమని ఆదేశించబడ్డారో ఆసందేశాలను స్పష్టంగా చేరవేయటం మాత్రమే వారిపై బాధ్యత ఉన్నది. నిశ్చయంగా వారు సందేశాలను చేరవేశారు. అల్లాహ్ అవిశ్వాసపరుల కొరకు ఇచ్ఛను,ఎంపిక చేసే అధికారము ఇచ్చి వారి వద్దకు తన ప్రవక్తలను పంపించిన తరువాత తఖ్దీర్ ని నిరాకరించే విషయంలో అవిశ్వాసపరుల కొరకు ఎటువంటి ఆధారము లేదు.