×
النحلఆయత్ 65

అల్-ముఖ్తసర్

وَٱللَّهُ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَأَحْيَا بِهِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَآ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّقَوْمٍ يَسْمَعُونَ ﴿٦٥﴾

మరియు అల్లాహ్ ఆకాశము నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా బంజరుగా,పొడిగా ఉన్న భూమి నుండి మొక్కలను వెలికి తీసి భూమిలో జీవం పోశాడు. నిశ్చయంగా ఆకాశము నుండి వర్షం కురిపించటంలో,దాని ద్వారా భూమి యొక్క మొక్కలను వెలికి తీయటంలో అల్లాహ్ వాక్కును విని దానిలో యోచన చేసే జాతి వారి కొరకు అల్లాహ్ సామర్ధ్యంపై స్పష్టమైన సూచన కలదు.