×
النحلఆయత్ 86

అల్-ముఖ్తసర్

وَإِذَا رَءَا ٱلَّذِينَ أَشْرَكُوا۟ شُرَكَآءَهُمْ قَالُوا۟ رَبَّنَا هَـٰٓؤُلَآءِ شُرَكَآؤُنَا ٱلَّذِينَ كُنَّا نَدْعُوا۟ مِن دُونِكَ ۖ فَأَلْقَوْا۟ إِلَيْهِمُ ٱلْقَوْلَ إِنَّكُمْ لَكَـٰذِبُونَ ﴿٨٦﴾

ముష్రికులు తాము అల్లాహ్ ను వదిలి ఆరాధించే తమ ఆరాధ్యదైవాలను పరలోకములో చూసినప్పుడు వారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా వీరందరినే మేము నిన్ను వదిలి ఆరాధించి సాటి కల్పించినవారు. వారు తమ భారమును వారిపై వేయటానికి అలా పలుకుతారు. అప్పుడు అల్లాహ్ వారి ఆరాధ్యదైవాలకు మాట్లాడిస్తాడు. అప్పుడు వారు వారిని ఖండిస్తూ ఇలా పలుకుతారు : ఓ ముష్రికులారా మీరు నిశ్చయంగా అల్లాహ్ తోపాటు సాటికల్పించి మీ ఆరాధన విషయంలో అబధ్ధం పలుకుతున్నారు. ఆయనతో పాటు సాటి ఉంటేగా ఆరాధించబడటానికి.