అల్-ముఖ్తసర్
وَإِذْ قُلْنَا لَكَ إِنَّ رَبَّكَ أَحَاطَ بِٱلنَّاسِ ۚ وَمَا جَعَلْنَا ٱلرُّءْيَا ٱلَّتِىٓ أَرَيْنَـٰكَ إِلَّا فِتْنَةً لِّلنَّاسِ وَٱلشَّجَرَةَ ٱلْمَلْعُونَةَ فِى ٱلْقُرْءَانِ ۚ وَنُخَوِّفُهُمْ فَمَا يَزِيدُهُمْ إِلَّا طُغْيَـٰنًا كَبِيرًا ﴿٦٠﴾
ఓ ప్రవక్తా మేము మీతో ఇలా పలికినప్పటి వైనమును గుర్తు చేసుకోండి నిశ్చయంగా మీ ప్రభువు ప్రజలను అధికారముతో చుట్టుముట్టాడు.అయితే వారు అతని ఆదీనంలో ఉంటారు. మరియు అల్లాహ్ వారి నుండి మిమ్మల్ని నిరోదిస్తాడు. అయితే మీరు దేన్ని చేరవేసే ఆదేశం ఇవ్వబడినదో దాన్ని చేరవేయండి. ఇస్రా రాత్రిలో మీకు కళ్ళారా చూపించినది ప్రజలకు మేము పరీక్షగా చేయటానికి మాత్రమే. వారు దాన్ని అంగీకరిస్తారా లేదా దాన్ని తిరస్కరిస్తారా ?.మరియు ఖుర్ఆన్ లో ప్రస్తాంవించబడిన జఖ్ఖూమ్ వృక్షము అది నరక పాతాళము నుండి మొలకెత్తుకుని వస్తుంది దాన్ని మేము వారి కొరకు పరీక్షగా మాత్రమే మార్చాము. అయితే వారు ఎప్పుడైతే ఈ రెండు సూచనలను విశ్వసించలేదో అప్పుడు వారు ఇతర సూచనలనూ విశ్వసించరు. మరియు మేము వారిని సూచనలను అవతరింపజేసి భయపెడుతున్నాము. వాటిని అవతరింపజేయటం ద్వారా భయపెట్టటం వలన వారు అవిశ్వాసంలో అధికమవటములో ,అపమార్గంలో ఎక్కవవటములో అధికమయ్యారు.