×
البقرةఆయత్ 247

అల్-ముఖ్తసర్

وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ إِنَّ ٱللَّهَ قَدْ بَعَثَ لَكُمْ طَالُوتَ مَلِكًا ۚ قَالُوٓا۟ أَنَّىٰ يَكُونُ لَهُ ٱلْمُلْكُ عَلَيْنَا وَنَحْنُ أَحَقُّ بِٱلْمُلْكِ مِنْهُ وَلَمْ يُؤْتَ سَعَةً مِّنَ ٱلْمَالِ ۚ قَالَ إِنَّ ٱللَّهَ ٱصْطَفَىٰهُ عَلَيْكُمْ وَزَادَهُۥ بَسْطَةً فِى ٱلْعِلْمِ وَٱلْجِسْمِ ۖ وَٱللَّهُ يُؤْتِى مُلْكَهُۥ مَن يَشَآءُ ۚ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٌ ﴿٢٤٧﴾

వారి ప్రవక్త వారితో అన్నారు : అతని నేతృత్వంలో పోరాడటానికి అల్లాహ్ మీ కొరకు తాలూత్ ను మీపై రాజుగా నియమించాడు. ఈ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ, విముఖత చూపినవారు ఇలా ఆన్నారు : అతని అధికారం మాపై ఎలా నడుస్తుంది ? రాజ్యాధికారానికి అతనికన్నా మేమే ఎక్కువ హక్కుదారులం. అతను రాకుమారుడు కూడా కాదు, పాలించటానికి సిరిసంపదల్లో కూడా అతనికి విస్త్రుతి ఒసగబడలేదే? వారి ప్రవక్త వారితో ఇలా అన్నారు : అల్లాహ్ అతన్నే మీపై నాయకునిగా ఎన్నుకున్నాడు. జ్ఞానంలో విస్త్రుతిని, శరీరంలో బలాన్ని అధికంగా ఇచ్చాడు. తన కారుణ్యంతో,వివేకంతో అల్లాహ్ తాను కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తాడు. అల్లాహ్ తాను కోరిన వారికి విశాలంగా ఇస్తాడు. తన సృష్టిలో అర్హులెవరో బాగా తెలిసినవాడు.