అల్-ముఖ్తసర్
وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ إِنَّ ءَايَةَ مُلْكِهِۦٓ أَن يَأْتِيَكُمُ ٱلتَّابُوتُ فِيهِ سَكِينَةٌ مِّن رَّبِّكُمْ وَبَقِيَّةٌ مِّمَّا تَرَكَ ءَالُ مُوسَىٰ وَءَالُ هَـٰرُونَ تَحْمِلُهُ ٱلْمَلَـٰٓئِكَةُ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ﴿٢٤٨﴾
వారి ప్రవక్త వారితో ఇలా అన్నారు : మీపై అతన్ని రాజుగా నియమించటానికి గొప్ప నిదర్శనం ఏమిటంటే అల్లాహ్ తాబూత్ ను మీకు తిరిగి ప్రసాదిస్తాడు. ఆ పెట్టెలో ఇస్రాయీల్ వంశీయుల వైభవం, అందులో గుండె నిబ్బరం, మూసా,హారూన్ కుటుంబీకులు వదిలి వెళ్ళిన అవశేషాలు ఉన్నాయి. ఉదాహరణకు కర్ర. కొన్ని పత్రాలు. నిస్సందేహంగా ఇందులో మీకు స్పష్టమైన నిదర్శనం ఉంది ఒకవేళ మీరు నిజవిశ్వాసులైతే.