×
البقرةఆయత్ 249

అల్-ముఖ్తసర్

فَلَمَّا فَصَلَ طَالُوتُ بِٱلْجُنُودِ قَالَ إِنَّ ٱللَّهَ مُبْتَلِيكُم بِنَهَرٍ فَمَن شَرِبَ مِنْهُ فَلَيْسَ مِنِّى وَمَن لَّمْ يَطْعَمْهُ فَإِنَّهُۥ مِنِّىٓ إِلَّا مَنِ ٱغْتَرَفَ غُرْفَةًۢ بِيَدِهِۦ ۚ فَشَرِبُوا۟ مِنْهُ إِلَّا قَلِيلًا مِّنْهُمْ ۚ فَلَمَّا جَاوَزَهُۥ هُوَ وَٱلَّذِينَ ءَامَنُوا۟ مَعَهُۥ قَالُوا۟ لَا طَاقَةَ لَنَا ٱلْيَوْمَ بِجَالُوتَ وَجُنُودِهِۦ ۚ قَالَ ٱلَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَـٰقُوا۟ ٱللَّهِ كَم مِّن فِئَةٍ قَلِيلَةٍ غَلَبَتْ فِئَةً كَثِيرَةًۢ بِإِذْنِ ٱللَّهِ ۗ وَٱللَّهُ مَعَ ٱلصَّـٰبِرِينَ ﴿٢٤٩﴾

తాలూత్ సైన్యాన్ని నగరం నుండి తీసుకుని బయలుదేరినప్పుడు వారితో ఇలా అన్నారు: నిస్సందేహంగా అల్లాహ్ ఒక కాలువ ద్వారా మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. అందులోని నీళ్ళని త్రాగినవాడు నా మార్గంలో లేడు. పోరాటంలో నాతో ఉండడు. త్రాగనివాడు మాత్రమే నా మార్గంలోనివాడు. పోరాటంలో నాతొ ఉంటాడు. చేత్తో గుక్కెడు నీరు త్రాగితే పర్వాలేదు. కాని కొద్దిమంది తప్ప మిగిలిన వారంతా త్రాగేశారు.కొద్దిమంది మాత్రం తీవ్ర దాహం ఉన్నప్పటికీ త్రాగకుండా సహనం వహించారు. తాలూత్ విశ్వాసులైన తన సైన్యంతో కాలువ దాటి ముందుకు సాగిపోతున్నప్పుడు, వారి సైన్యంలోని కొందరు ఇలా అన్నారు: జాలూత్తో, అతని సైన్యంతో తలపడే శక్తి ఈరోజు మాలో లేదు. కాని ప్రళయ దినాన అల్లాహ్ను కలుసు కోవలసి ఉందనే దృఢవిశ్వాసం గలవారు ఇలా అన్నారు: విశ్వాసుల ఒక చిన్న వర్గం, తిరస్కారుల ఒక పెద్ద వర్గాన్ని అల్లాహ్ ఆజ్ఞతో, సహాయంతో జయించటం ఎన్నోసార్లు జరిగింది. నీతి ఏమిటంటే సహాయం విశ్వాసంతో ఉంది, మెజారిటి [సంఖ్య]తో కాదు.అల్లాహ్ తన దాసుల్లోని సహనం చూపే వారికి అండగా ఉంటాడు. వారికి సహాయం అందిస్తాడు.