×
النساءఆయత్ 45

అల్-ముఖ్తసర్

وَٱللَّهُ أَعْلَمُ بِأَعْدَآئِكُمْ ۚ وَكَفَىٰ بِٱللَّهِ وَلِيًّا وَكَفَىٰ بِٱللَّهِ نَصِيرًا ﴿٤٥﴾

ఓ విశ్వాసపరులారా మీ శతృవుల గురించి మీకన్న బాగా అల్లాహ్ కు తెలుసు. కావున ఆయన వారి గురించి మీకు తెలియపరచాడు మరియు వారి శతృత్వం గురించి మీకు స్పష్టపరచాడు. మరియు వారి ఆధిక్యత నుండి మిమ్మల్ని రక్షించటానికి సంరక్షకుడిగా అల్లాహ్ చాలు. మరియు వారి కుట్ర నుండి,వారి బాధ నుండి మిమ్మల్ని నిరోధించటానికి సహాయకుడిగా అల్లాహ్ చాలు. ఆయన వారికి వ్యతిరేకంగా మీకు సహాయం చేస్తాడు.