×
النساءఆయత్ 46

అల్-ముఖ్తసర్

مِّنَ ٱلَّذِينَ هَادُوا۟ يُحَرِّفُونَ ٱلْكَلِمَ عَن مَّوَاضِعِهِۦ وَيَقُولُونَ سَمِعْنَا وَعَصَيْنَا وَٱسْمَعْ غَيْرَ مُسْمَعٍ وَرَٰعِنَا لَيًّۢا بِأَلْسِنَتِهِمْ وَطَعْنًا فِى ٱلدِّينِ ۚ وَلَوْ أَنَّهُمْ قَالُوا۟ سَمِعْنَا وَأَطَعْنَا وَٱسْمَعْ وَٱنظُرْنَا لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَقْوَمَ وَلَـٰكِن لَّعَنَهُمُ ٱللَّهُ بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا ﴿٤٦﴾

అల్లాహ్ అవతరింపజేసిన వాక్కును మార్చే చెడ్డ వ్యక్తులు యూదుల్లో ఉన్నారు. వారు అల్లాహ్ అవతరింపజేసిన వాటికి భిన్నంగా వాటిని అర్ధం చేసుకుంటారు. మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైన ఆదేశమిచ్చినప్పుడు వారు ఆయనతో ఈ విధంగా పలికేవారు : మేము మీ మాటను విన్నాము మరియు మేము మీకు అవిధేయత చూపించాము. మరియు వారు వ్యంగ్యముగా ఇలా పలికేవారు : మేము చెప్పేది మీరు వినండి, మీరు వినలేదు. వారు తమ మాటల్లో రాయినా అని పలికి తాము రాయినా సమ్అక కోరుకుంటున్నట్లు సందేహమునకు గురి చేసేవారు. మరియు వారు మాత్రం రఊన (మతి లేనివాడు) పదమును కోరుకునేవారు. వారు తమ నాలుకలను దానితో వక్రీకరిస్తారు. వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను శపించదలిచారు మరియు ధర్మంలో లోపాలను చూపదలిచారు. ఒక వేళ వారు తమ మాటల్లో సమిఅనా ఖౌలకా వ అసైనా అమ్రకా (మేము మీ మాటను విన్నాము మరియు మీ ఆదేశమును ఉల్లంఘించాము) కు బదులుగా సమిఅనా ఖౌలక వ అతఅనా అమ్రక (మేము మీ మాట విన్నాము మీ ఆదేశమునకు కట్టుబడి ఉన్నాము) అని పలికి ఉంటే మరియు ఇస్మఅ్ లా సమిఅత కు బదులుగా ఇస్మఅ్ అని పలికి ఉంటే మరియు వారి మాట రాయినా కు బదులుగా ఇన్తజిర్ నా నఫ్హము అన్క మా తఖూలు అని పలికి ఉంటే అది వారు మొదట పలికిన దాని కంటే వారి కొరకు మేలైనదిగా మరియు దాని కంటే ఎక్కువ న్యాయపురితమైనదిగా ఉండేది ఎందుకంటే అందులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పక్షమున తగిన సత్ప్రవర్తన ఉన్నది. కాని అల్లాహ్ వారిని శపించాడు. వారి అవిశ్వాసం వలన తన కారుణ్యము నుండి వారిని గెంటివేశాడు. కావున వారు తమకు ప్రయోజనం కలిగించే విశ్వాసమును చూపరు.