×
المائدةఆయత్ 106

అల్-ముఖ్తసర్

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ شَهَـٰدَةُ بَيْنِكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ ٱلْمَوْتُ حِينَ ٱلْوَصِيَّةِ ٱثْنَانِ ذَوَا عَدْلٍ مِّنكُمْ أَوْ ءَاخَرَانِ مِنْ غَيْرِكُمْ إِنْ أَنتُمْ ضَرَبْتُمْ فِى ٱلْأَرْضِ فَأَصَـٰبَتْكُم مُّصِيبَةُ ٱلْمَوْتِ ۚ تَحْبِسُونَهُمَا مِنۢ بَعْدِ ٱلصَّلَوٰةِ فَيُقْسِمَانِ بِٱللَّهِ إِنِ ٱرْتَبْتُمْ لَا نَشْتَرِى بِهِۦ ثَمَنًا وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۙ وَلَا نَكْتُمُ شَهَـٰدَةَ ٱللَّهِ إِنَّآ إِذًا لَّمِنَ ٱلْـَٔاثِمِينَ ﴿١٠٦﴾

ఓ విశ్వాసపరులారా మరణ సూచనల్లోంచి ఏదైన సూచన బహిర్గతమై మీలో నుంచి ఎవరికైన మరణం ఆసన్నమైనప్పుడు తన వీలునామా వ్రాసేటప్పుడు ముస్లిముల్లోంచి న్యాయశీలులైన ఇద్దరిని సాక్షులగా నియమించుకోవాలి.లేదా ఒక వేళ మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీకు మరణం ఆసన్నమైతే సాక్షులుగా ముస్లిములు లేని పక్షంలో ఇద్దరు అవిశ్వాసపరులను సాక్షులుగా నియమించుకోవచ్చు.ఒక వేళ వారిద్దరి సాక్షంలో సందేహం కలిగితే వారిద్దరిని మీరు నమాజుల్లోంచి ఏదైన ఒక నమాజు తరువాత నిలబెట్టండి.వారిద్దరు దేనికీ బదులుగా అల్లాహ్ వద్ద ఉన్న తమ వాటాను అమ్ముకోము అని,దానికి బదులుగా ఏ దగ్గరి బందువును ఇష్టపడమని,తమ వద్ద ఉన్న అల్లాహ్ సాక్షాలను వేటినీ దాచి పెట్టమని వారిద్దరు అల్లాహ్ పై ప్రమాణం చేయాలి.ఒక వేళ వారిద్దరు ఇలా చేస్తే వారు అల్లాహ్ కొరకు పాపమును చేసిన వారు,అవిధేయతకు పాల్పడిన వారవుతారు.