అల్-ముఖ్తసర్
فَإِنْ عُثِرَ عَلَىٰٓ أَنَّهُمَا ٱسْتَحَقَّآ إِثْمًا فَـَٔاخَرَانِ يَقُومَانِ مَقَامَهُمَا مِنَ ٱلَّذِينَ ٱسْتَحَقَّ عَلَيْهِمُ ٱلْأَوْلَيَـٰنِ فَيُقْسِمَانِ بِٱللَّهِ لَشَهَـٰدَتُنَآ أَحَقُّ مِن شَهَـٰدَتِهِمَا وَمَا ٱعْتَدَيْنَآ إِنَّآ إِذًا لَّمِنَ ٱلظَّـٰلِمِينَ ﴿١٠٧﴾
ఒక వేళ ప్రమాణం చేసిన తరువాత సాక్షంలో లేదా ప్రమాణంలో వారిద్దరి అసత్యం బట్టబయలైతే లేదా వారిద్దరి అవినీతి బహిర్గతమైతే మృతునికి దగ్గరి వారు ఇద్దరు వారిద్దరి స్థానంలో నిలబడి సత్యమేదో తెలిపి ప్రమాణం చేస్తూ సాక్షమివ్వాలి.వారిరువురు మా సాక్షము వారిద్దరి నీతి,నిజాయితి విషయంలో వారి సాక్షముకన్న వారి అసత్యము,అవినీతి విషయంలో ఎక్కువ హక్కు కలదని అల్లాహ్ పై ప్రమాణం చేయాలి.మరియు మేము అసత్యపు ప్రమాణం చేయలేదు.ఒకవేళ మేము అబద్దపు సాక్షం పలికితే మేము దుర్మార్గుల్లోంచి,అల్లాహ్ హద్దులను అతిక్రమించే వారిలో నుంచి అవుతాము.