×
المائدةఆయత్ 110

అల్-ముఖ్తసర్

إِذْ قَالَ ٱللَّهُ يَـٰعِيسَى ٱبْنَ مَرْيَمَ ٱذْكُرْ نِعْمَتِى عَلَيْكَ وَعَلَىٰ وَٰلِدَتِكَ إِذْ أَيَّدتُّكَ بِرُوحِ ٱلْقُدُسِ تُكَلِّمُ ٱلنَّاسَ فِى ٱلْمَهْدِ وَكَهْلًا ۖ وَإِذْ عَلَّمْتُكَ ٱلْكِتَـٰبَ وَٱلْحِكْمَةَ وَٱلتَّوْرَىٰةَ وَٱلْإِنجِيلَ ۖ وَإِذْ تَخْلُقُ مِنَ ٱلطِّينِ كَهَيْـَٔةِ ٱلطَّيْرِ بِإِذْنِى فَتَنفُخُ فِيهَا فَتَكُونُ طَيْرًۢا بِإِذْنِى ۖ وَتُبْرِئُ ٱلْأَكْمَهَ وَٱلْأَبْرَصَ بِإِذْنِى ۖ وَإِذْ تُخْرِجُ ٱلْمَوْتَىٰ بِإِذْنِى ۖ وَإِذْ كَفَفْتُ بَنِىٓ إِسْرَٰٓءِيلَ عَنكَ إِذْ جِئْتَهُم بِٱلْبَيِّنَـٰتِ فَقَالَ ٱلَّذِينَ كَفَرُوا۟ مِنْهُمْ إِنْ هَـٰذَآ إِلَّا سِحْرٌ مُّبِينٌ ﴿١١٠﴾

అల్లాహ్ ఈసా అలైహిస్సలాం ను ఉద్దేశించి తెలిపిన వేళను మీరు గుర్తు చేసుకోండి : ఓ మర్యం కుమారుడగు ఈసా, తండ్రి లేకుండా నిన్ను పుట్టించి నీపై నేను చేసిన అనుగ్రహమును గుర్తు చేసుకో,నీ తల్లి మర్యం అలైహస్సలాం ను ఆమె కాలపు స్త్రీలపై ప్రాధాన్యతను ప్రసాదించి నేను చేసిన అనుగ్రహమును గుర్తు చేసుకో,నీ పై నేను కురిపించిన అనుగ్రహాల్లోంచి హజ్రత్ జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా నేను నీకు బలమును చేకూర్చిన నా అనుగ్రహమును గుర్తు చేసుకో,నీవు శిసువుగా ఉన్నప్పుడే అల్లాహ్ వైపున పిలుస్తూ ప్రజలతో సంభాషించినావు,నీవు పెద్దవాడైనప్పుడు మేము నీకు ఇచ్చి పంపించిన దైవదౌత్యం ద్వారా వారితో సంభాషించినావు,నేను నీకు వ్రాయటం నేర్పించటం ,మూసా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై నేను అవతరింపజేసిన తౌరాతును ,నేను నీపై అవతరింపజేసిన ఇంజీలును నేను నీకు నేర్పించటం,ధర్మ రహస్యాలను,దాని లాభాలను,దాని వివేచనాలను నేను నీకు నేర్పించటం నేను నీకు ప్రసాధించిన అనుగ్రహాల్లోంచివి.నీవు మట్టితో పక్షి రూపమును తయారు చేసి ఆ తరువాత నీవు అందులో ఊదితే అది పక్షిగా అవ్వటం,పుట్టుకతో అంధులుగా ఉన్న వారిని నీవు అతనిని అంధత్వం నుండి నయం చేయటం,నీవు కుష్ఠి రోగిని నయం చేసి మంచి మృధువైన చర్మం గల వారిగా చేయటం,మృతులను బ్రతికించమని అల్లాహ్ తో నీ దుఆ ద్వారా వారిని నీవు జీవింప చేయటం నేను నీకు ప్రసాదించిన అనుగ్రహాల్లోంచే.ఇవన్నీ నా ఆదేశంతోనే జరిగినవి.నీవు ఇస్రాయీలు సంతతి వద్దకు స్పష్టమైన మహిమలను తీసుకుని వచ్చినప్పుడు వారు నిన్ను హత్య చేయాలని పూనుకుంటే వారిని నీ నుండి ఆపటం నేను నీకు ప్రసాధించిన అనుగ్రహాల్లోంచే.అయితే వారు వాటిని తిరస్కరించారు.ఈసా తీసుకుని వచ్చినవి స్పష్టమైన మాయాజాలము అని వారన్నారు.