×
المائدةఆయత్ 116

అల్-ముఖ్తసర్

وَإِذْ قَالَ ٱللَّهُ يَـٰعِيسَى ٱبْنَ مَرْيَمَ ءَأَنتَ قُلْتَ لِلنَّاسِ ٱتَّخِذُونِى وَأُمِّىَ إِلَـٰهَيْنِ مِن دُونِ ٱللَّهِ ۖ قَالَ سُبْحَـٰنَكَ مَا يَكُونُ لِىٓ أَنْ أَقُولَ مَا لَيْسَ لِى بِحَقٍّ ۚ إِن كُنتُ قُلْتُهُۥ فَقَدْ عَلِمْتَهُۥ ۚ تَعْلَمُ مَا فِى نَفْسِى وَلَآ أَعْلَمُ مَا فِى نَفْسِكَ ۚ إِنَّكَ أَنتَ عَلَّـٰمُ ٱلْغُيُوبِ ﴿١١٦﴾

ప్రళయ దినమున మర్యం కుమారుడు ఈసా అలైహిస్సలాంను ఉద్దేశించి అల్లాహ్ పలికే సంధర్భమును మీరు గుర్తు చేసుకోండి: ఓ మర్యం కుమారుడగు ఈసా మీరు ప్రజలతో మీరు నన్ను నా తల్లిని అల్లాహ్ ను వదిలి ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని అన్నారా ?. అప్పుడు ఈసా అలైహిస్సలాం తన ప్రభువు పరిశుద్దతను కొనియాడుతూ ఇలా సమాధానమిచ్చారు : వారికి నేను సత్యం తప్ప వేరే వాటిని తెలపటం నాకు తగదు.ఒక వేళ నేను అలా అని ఉంటే దానిని నీవు తెలుసుకుంటావు.ఎందుకంటే నీ ముందు ఏ విషయం దాగదు.నేను నా మనస్సులో దాచిన విషయాలను నీవు తెలుసుకుంటావు.నీ మనస్సులో ఏముందో నాకు తెలియదు.నిశ్చయంగా నీ ఒక్కడివే ప్రతి అగోచర విషయాన్ని,ప్రతి దాగి ఉన్న విషయాన్ని,ప్రతి బహిర్గతమైన విషయాన్ని తెలుసుకుంటావు.