×
المائدةఆయత్ 89

అల్-ముఖ్తసర్

لَا يُؤَاخِذُكُمُ ٱللَّهُ بِٱللَّغْوِ فِىٓ أَيْمَـٰنِكُمْ وَلَـٰكِن يُؤَاخِذُكُم بِمَا عَقَّدتُّمُ ٱلْأَيْمَـٰنَ ۖ فَكَفَّـٰرَتُهُۥٓ إِطْعَامُ عَشَرَةِ مَسَـٰكِينَ مِنْ أَوْسَطِ مَا تُطْعِمُونَ أَهْلِيكُمْ أَوْ كِسْوَتُهُمْ أَوْ تَحْرِيرُ رَقَبَةٍ ۖ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلَـٰثَةِ أَيَّامٍ ۚ ذَٰلِكَ كَفَّـٰرَةُ أَيْمَـٰنِكُمْ إِذَا حَلَفْتُمْ ۚ وَٱحْفَظُوٓا۟ أَيْمَـٰنَكُمْ ۚ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمْ ءَايَـٰتِهِۦ لَعَلَّكُمْ تَشْكُرُونَ ﴿٨٩﴾

ఓ విశ్వాసపరులారా ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా మీ నోటా వెలువడే ప్రమాణాలకు అల్లాహ్ లెక్కతీసుకోడు. కావాలని ఉద్దేశ్యపూర్వకంగా మనస్పూర్తిగా మీరు చేసే ప్రమాణాలకు ,ప్రమాణాలను విరగ్గొట్టటం గురించి లెక్క తీసుకుంటాడు.ఉద్దేశ్యపూర్వకంగా మీరు చేసిన ప్రమాణపు పాపమును ,దానిని మీ నోటితో పలికి దానిని భంగపరచినప్పుడు మూడు వస్తువుల్లోంచి ఏదైన ఒక దానిని ఎంచుకుని పూర్తి చేస్తే పాపమును తుడిచి వేస్తుంది.అవి పది మంది నిరు పేదలకు మీ ప్రాంతములో తినే ఆహారములో నుంచి మధ్యరకపు భోజనం తినిపించడం,ప్రతి మనిషికి సగం సా (1.25 కిలోలు) లేదా వారికి అక్కడ వాడకంలో ఉన్న బట్టలను తొడిగించటం లేదా ఒక విశ్వాసపరుడైన బానిసను విముక్తి కలిగించటం.తన ప్రమాణ పరిహారమును చెల్లించే వ్యక్తి ఈ మూడింటిలోంచి ఏదీ పొందకపోతే మూడు రోజుల ఉపవాసములను పరిహారంగా ఉండాలి. ఓ విశ్వాసపరులారా మీరు అల్లాహ్ పై ప్రమాణం చేసి భంగపరచినప్పుడు తెలియపరచిన ఇదే మీ ప్రమాణాల పరిహారము.మీ ప్ఱమాణాలను కాపాడుకోండి అల్లాహ్ పై అబద్దపు ప్రమాణాలు చేయకుండా,అల్లాహ్ పై అధిక ప్రమాణాలు చేయకుండా,ఏ ప్రమాణంలో మేలున్నదో అటువంటి ప్రమాణాన్ని భంగపరచకుండా.మీరు మంచిని చేయండి.ప్రమాణాల పరిహారమును అల్లాహ్ మీకు తెలిపిన విదంగా చెల్లించండి.అల్లాహ్ హలాల్ హరామ్ గురించి తన స్పష్టమైన ఆదేశాలను మీ కొరకు వివరిస్తున్నాడు.బహుశా మీరు అల్లాహ్ మీకు తెలియని విషయాలను తెలియపరచినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటారని.