×
الأعرافఆయత్ 141

అల్-ముఖ్తసర్

وَإِذْ أَنجَيْنَـٰكُم مِّنْ ءَالِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوٓءَ ٱلْعَذَابِ ۖ يُقَتِّلُونَ أَبْنَآءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَآءَكُمْ ۚ وَفِى ذَٰلِكُم بَلَآءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ ﴿١٤١﴾

ఓ ఇస్రాయీలు సంతతివారా మేము మిమ్మల్ని ఫిర్ఔన్ అతని జాతివారి అవమానకరమైన జీవితము నుండి విముక్తి కలిగించటం ద్వారా మిమ్మల్ని రక్షించిన వేళను గుర్తు చేసుకోండి. వారు మీ మగ సంతానమును హతమార్చి,మీ స్త్రీలను సేవకోసం వదిలివేసి మిమ్మల్ని రకరకాల శిక్షల రుచి చూపించేవారు. ఫిర్ఔన్,అతని జాతివారి నుండి మీకు విముక్తి కలిగించటంలో మీ ప్రభువు తరుపు నుండి పెద్ద పరీక్ష ఉన్నది. అది మీ నుండి కృతజ్ఞతను కోరుతుంది.