అల్-ముఖ్తసర్
وَلَمَّا جَآءَ مُوسَىٰ لِمِيقَـٰتِنَا وَكَلَّمَهُۥ رَبُّهُۥ قَالَ رَبِّ أَرِنِىٓ أَنظُرْ إِلَيْكَ ۚ قَالَ لَن تَرَىٰنِى وَلَـٰكِنِ ٱنظُرْ إِلَى ٱلْجَبَلِ فَإِنِ ٱسْتَقَرَّ مَكَانَهُۥ فَسَوْفَ تَرَىٰنِى ۚ فَلَمَّا تَجَلَّىٰ رَبُّهُۥ لِلْجَبَلِ جَعَلَهُۥ دَكًّا وَخَرَّ مُوسَىٰ صَعِقًا ۚ فَلَمَّآ أَفَاقَ قَالَ سُبْحَـٰنَكَ تُبْتُ إِلَيْكَ وَأَنَا۠ أَوَّلُ ٱلْمُؤْمِنِينَ ﴿١٤٣﴾
మరియు మూసా తన ప్రభువుతో సంభాషించటానికి తన కొరకు నిర్ధారించిన వేళలో వచ్చినప్పుడు అది పూర్తిగా నలభై రాత్రులు. ఆదేశించిన విషయాలు,వారించిన విషయాల గురించి,ఇతర విషయాల గురించి ఆయన ప్రభువు ఆయనతో మాట్లాడారు. తన ప్రభువును చూడాలని ఆయన మనస్సు ఆరాటపడింది. అయితే ఆయన అతని వైపు చూస్తానని అతనితో (అల్లాహ్ తో) వేడుకున్నారు. అల్లాహ్ సుబహానహు వ తఆలా ఆయనకు ఇలా సమాధానమిచ్చాడు : నీవు నన్ను చూసే సామర్ధ్యం లేకపోవటం వలన నన్ను ఇహలోక జీవితంలో చూడలేవు. కాని నేను పర్వతంపై కాంతిని ప్రభవింప చేసినప్పుడు నీవు దానిని చూడు. ఒకవేళ అది తన స్థానంలో యదావిధిగా ఉంటే (నీపై) ప్రభావం చూపదు. తొందరలోనే నీవు నన్ను చూడగలుగుతావు. ఒకవేళ అది నేలమట్టం అయిపోతే నీవు ఈ లోకంలో ఖచ్చితంగా నన్ను చూడలేవు. అల్లాహ్ పర్వతంపై కాంతిని ప్రభవింప చేసినప్పుడు దానిని నేలమట్టం చేసేశాడు. మూసా స్పృహ కోల్పోయి పడిపోయారు. ఆ తరువాత ఆయనకు సంభవించిన అపస్మారక స్థితి నుండి స్పృహలోకి వచ్చినప్పుడు ఆయన ఇలా పలికారు : ఓ నా ప్రభువా నేను నీకు తగని ప్రతి విషయం నుండి నిన్ను పరిశుధ్ధుడిగా భావిస్తున్నాను. ఇదిగో నేను నిన్ను ఇహలోకంలో చూడటం గురించి నిన్ను కోరటం నుండి నీతో క్షమాపణ కోరుతున్నాను. మరియు నేను నా జాతివారిలోంచి విశ్వసించిన వారిలో మొట్ట మొదటి వాడిని.