అల్-ముఖ్తసర్
فَخَلَفَ مِنۢ بَعْدِهِمْ خَلْفٌ وَرِثُوا۟ ٱلْكِتَـٰبَ يَأْخُذُونَ عَرَضَ هَـٰذَا ٱلْأَدْنَىٰ وَيَقُولُونَ سَيُغْفَرُ لَنَا وَإِن يَأْتِهِمْ عَرَضٌ مِّثْلُهُۥ يَأْخُذُوهُ ۚ أَلَمْ يُؤْخَذْ عَلَيْهِم مِّيثَـٰقُ ٱلْكِتَـٰبِ أَن لَّا يَقُولُوا۟ عَلَى ٱللَّهِ إِلَّا ٱلْحَقَّ وَدَرَسُوا۟ مَا فِيهِ ۗ وَٱلدَّارُ ٱلْـَٔاخِرَةُ خَيْرٌ لِّلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ ﴿١٦٩﴾
అప్పుడు వారందరి తరువాత వారి ప్రాతినిద్యమును వహిస్తూ చెడ్డవారు వచ్చారు. వారు తమ పూర్వికుల నుండి తౌరాతును పుచ్చుకున్నారు. వారు దానిని చదివే వారు,అందులో ఉన్న వాటిని ఆచరించేవారు కాదు. అల్లాహ్ గ్రంధాన్నివక్రీకరించటానికి,అందులో అవతరింపబడని ఆదేశమును ఇవ్వటానికి ప్రాపంచిక నాసిక రకమైన సామగ్రిని లంచముగా పుచ్చుకునేవారు. వారి పాపాలను అల్లాహ్ మన్నిస్తాడు అని వారు నమ్మేవారు. ఒక వేళ ప్రాపంచిక సాధారణ సామగ్రి వారి వద్దకు వస్తే దాన్ని వారు మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు. ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా అల్లాహ్ పై సత్యమును తప్ప వేరేది మాట్లాడ కూడదని వీరందరితో అల్లాహ్ వాగ్ధానములను,నిభందనలను తీసుకోలేదా ?. గ్రంధంపై ఆచరణ వారు జ్ఞానం లేకుండా కాదు జ్ఞానం ఉండే వదిలేశారు. అందులో ఉన్న వాటిని చదివారు,దానిని తెలుసుకున్నారు. వారి పాపము చాలా తీవ్రమైనది. అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ కు భయపడే వారి కొరకు పరలోక నిలయము,పరలోకములో ఉండే శాస్వత అనుగ్రహాలు ఈ అశాస్వత సామగ్రి కన్న మేలైనవి. అయితే ఏమిటీ దైవభీతి కల వారి కొరకు అల్లాహ్ పరలోకంలో తయారు చేసి ఉన్నది మేలైనదని,శాస్వతమైనదని ఈ సాధారణమైన (అల్పమైన) సామగ్రిని పుచ్చుకునే వారందరు గ్రహించలేరా ?.