×
الأعرافఆయత్ 189

అల్-ముఖ్తసర్

هُوَ ٱلَّذِى خَلَقَكُم مِّن نَّفْسٍ وَٰحِدَةٍ وَجَعَلَ مِنْهَا زَوْجَهَا لِيَسْكُنَ إِلَيْهَا ۖ فَلَمَّا تَغَشَّىٰهَا حَمَلَتْ حَمْلًا خَفِيفًا فَمَرَّتْ بِهِۦ ۖ فَلَمَّآ أَثْقَلَت دَّعَوَا ٱللَّهَ رَبَّهُمَا لَئِنْ ءَاتَيْتَنَا صَـٰلِحًا لَّنَكُونَنَّ مِنَ ٱلشَّـٰكِرِينَ ﴿١٨٩﴾

ఓ పురుషులారా,స్త్రీలారా ఆయనే మిమ్మల్ని ఒకే ప్రాణి అయిన ఆదమ్ అలైహిస్సలాం నుండి పుట్టించాడు. ఆదమ్ అలైహిస్సలాం నుండి ఆయన భార్య హవ్వాను సృష్టించాడు. ఆయన ఆమెతో తృప్తి చెందటానికి,ఆమె ద్వారా ప్రశాంతతను పొందటానికి ఆమెను అతని ప్రక్కటెముక ద్వారా సృష్టించాడు. భర్త తన భార్యతో సమాగమం జరిపినప్పుడు ఆమె తేలికైన భారం (గర్భం) దాల్చింది. దాని అనుభూతి ఆమెకు కలుగలేదు. ఎందుకంటే అది దాని ఆరంభంలోనే ఉన్నది. ఆమె తన అవసరాల నిమిత్తం అటూ ఇటూ తిరుగుతూ ఎటువంటి బారము అనుభూతి లేకుండా తన గర్భాన్నికొనసాగించింది. అది ఆమే గర్భంలో పెద్దదై దానిని ఆమె భారంగా పొందినప్పుడు భార్యాభర్తలు ఇరువురు ఇలా పలుకుతూ దుఆ చేశారు : ఓ మా ప్రభువా ఒక వేళ నీవు మాకు ఏ లోపము లేని బిడ్డను ప్రసాదిస్తే మేము నీ అనుగ్రహము పై తప్పకుండా కృతజ్ఞత తెలుపుకునే వారమైపోతాము.