×
الأعرافఆయత్ 32

అల్-ముఖ్తసర్

قُلْ مَنْ حَرَّمَ زِينَةَ ٱللَّهِ ٱلَّتِىٓ أَخْرَجَ لِعِبَادِهِۦ وَٱلطَّيِّبَـٰتِ مِنَ ٱلرِّزْقِ ۚ قُلْ هِىَ لِلَّذِينَ ءَامَنُوا۟ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا خَالِصَةً يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۗ كَذَٰلِكَ نُفَصِّلُ ٱلْـَٔايَـٰتِ لِقَوْمٍ يَعْلَمُونَ ﴿٣٢﴾

ఓ ప్రవక్తా వస్త్రముల్లోంచి,పరిశుద్ధమైన తినే వస్తువుల్లోంచి,ఇతర వస్తువుల్లోంచి అల్లాహ్ హలాల్ చేసిన వాటిని హరాం చేసుకునే ముష్రికులను ఖండిస్తూ ఇలా పలకండి : మీ అలంకరణ కొరకు ఉన్న వస్త్రములను మీపై ఎవరు నిషేదించాడు?. అల్లాహ్ మీకు ప్రసాదించిన తినే వస్తువులు,త్రాగే వస్తువులను,ఇతర వాటిని మీపై ఎవరు నిషేదించారు ?. ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి నిశ్చయంగా ఈ పరిశుధ్ధ వస్తువులు ఇహలోక జీవితంలో విశ్వాసపరుల కొరకు ఉన్నవి. ఒక వేళ వాటిలో వారితోపాటు ఇతరులు ఇహలోకంలో భాగం పొందినా అవి ప్రళయదినాన వారి కొరకే ప్రత్యేకించబడుతాయి. వాటిలో విశ్వాసపరులతో పాటు అవిశ్వాసపరునికి భాగం లభించదు. ఎందుకంటే స్వర్గం అవిశ్వాసపరులపై నిషేదించబడినది. ఈ విధమైన వివరణ లాగే మేము జ్ఞానం కల జాతి వారికి ఆయతులను వివరించి తెలుపుతాము. ఎందుకంటే వారే వీటి ద్వారా ప్రయోజనం చెందుతారు.