అల్-ముఖ్తసర్
يَـٰبَنِىٓ ءَادَمَ إِمَّا يَأْتِيَنَّكُمْ رُسُلٌ مِّنكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ ءَايَـٰتِى ۙ فَمَنِ ٱتَّقَىٰ وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ ﴿٣٥﴾
ఓ ఆదం సంతతి వారా మీ వద్దకు మీ జాతుల నుండి నా తరుపు నుంచి ప్రవక్తలు వచ్చినప్పుడు వారు వారిపై నేను నా గ్రంధముల్లోంచి అవతరించిన ఆయతులను మీ ముందు చదివి వినిపిస్తే మీరు వారిపై విధేయత చూపండి. వారు తీసుకుని వచ్చిన దానిని అనుసరించండి. ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ భయభీతి కలిగి ఉంటారో,తమ ఆచరణలను సరిదిద్దుకుంటారో వారిపై ప్రళయ దినాన ఎటువంటి భయాందోళనలు ఉండవు. ప్రాపంచిక వాటాల్లోంచి వారు కోల్పోయిన దానిపై దుఃఖించరు.