×
الأعرافఆయత్ 53

అల్-ముఖ్తసర్

هَلْ يَنظُرُونَ إِلَّا تَأْوِيلَهُۥ ۚ يَوْمَ يَأْتِى تَأْوِيلُهُۥ يَقُولُ ٱلَّذِينَ نَسُوهُ مِن قَبْلُ قَدْ جَآءَتْ رُسُلُ رَبِّنَا بِٱلْحَقِّ فَهَل لَّنَا مِن شُفَعَآءَ فَيَشْفَعُوا۟ لَنَآ أَوْ نُرَدُّ فَنَعْمَلَ غَيْرَ ٱلَّذِى كُنَّا نَعْمَلُ ۚ قَدْ خَسِرُوٓا۟ أَنفُسَهُمْ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا۟ يَفْتَرُونَ ﴿٥٣﴾

అవిశ్వాసపరులు కేవలం జరుగుతుందని వారికి తెలుపబడిన బాధాకరమైన శిక్ష జరగటం గురించి వారు నిరీక్షిస్తున్నారు. దాని వైపునే పరలోకంలో వారి విషయం మరలుతుంది. వీటిలోంచి వారికి తెలుపబడినది,విశ్వాసపరులకి తెలుపబడిన పుణ్యము ఆ రోజు వస్తుంది. ఇహలోకంలో ఖుర్ఆన్ ను మరచిపోయిన వారు,అందులో వచ్చిన విషయాలను ఆచరించని వారు ఇలా పలుకుతారు : నిశ్చయంగా మా ప్రభువు ప్రవక్తలు ఎటువంటి సందేహం లేని సత్యమును తీసుకుని వచ్చారు. అది అల్లాహ్ వద్ద నుండి అవ్వటంలో ఎటువంటి సందేహం లేదు. అల్లాహ్ వద్ద మా కొరకు శిక్షను మన్నింపచేయటం కొరకు మధ్యవర్తులు ఉండి సిఫారసు చేస్తే ఎంతో బాగుండును, లేదా మేము చేసిన పాపకార్యాలకు బదులుగా సత్కార్యాలు చేసి వాటి ద్వారా మేము బతికి బయటపడటం కొరకు మేము ఇహలోక జీవితం వైపు మరలిపోయి ఉంటే ఎంతో బాగుండును. ఈ సత్యతిరస్కారులందరు తమ అవిశ్వాసం వలన తమంతటతామే వినాశనమును చవిచూస్తారు.వారు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధించేవారో వారు వారి నుండి మటుమాయమైపోయారు. వారు వారికి ప్రయోజనం చేయలేదు.