×
الأعرافఆయత్ 54

అల్-ముఖ్తసర్

إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِى خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ فِى سِتَّةِ أَيَّامٍ ثُمَّ ٱسْتَوَىٰ عَلَى ٱلْعَرْشِ يُغْشِى ٱلَّيْلَ ٱلنَّهَارَ يَطْلُبُهُۥ حَثِيثًا وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ وَٱلنُّجُومَ مُسَخَّرَٰتٍۭ بِأَمْرِهِۦٓ ۗ أَلَا لَهُ ٱلْخَلْقُ وَٱلْأَمْرُ ۗ تَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلْعَـٰلَمِينَ ﴿٥٤﴾

ఓ ప్రజలారా నిశ్చయంగా మీ ప్రభువు ఆ అల్లాహ్ ఎవరైతే ఎటువంటి పూర్వ నమూనా లేకుండా భూమిని,ఆకాశాలను ఆరు దినాల్లో సృష్టించాడు. ఆ తరువాత ఆయన సుబహానహు వ తఆలా తన ఘనతకు తగిన విధంగా సింహాసనాన్ని అధీష్టించినాడు,ఆసీనుడైనాడు. అది ఏ విధంగా అన్నది మేము గ్రహించలేము. అతడు రాత్రి చీకటిని ఉదయపు వెలుగు ద్వారా,ఉదయపు వెలుగును రాత్రి చీకటి ద్వారా దూరం చేస్తాడు. ఆ రెండింటిలోంచి ప్రతి ఒక్కటి వేరే దాన్ని వేగంగా వెంబడిస్తుంది. ఏ విధంగానంటే దాని నుండి అది ఆలస్యం అవ్వదు. ఎప్పుడైతే ఇది వెళుతుందో అది ప్రవేసిస్తుంది. మరియు ఆయన సుబహానహు వ తఆలా సూర్యుడిని సృష్టించాడు,చంద్రుడిని సృష్టించాడు,మరియు నక్షత్రములను విధేయులుగా,ఆదేశాలకు కట్టుబడి ఉండేవారిగా సృష్టించాడు. వినండి సృష్టి ప్రక్రియ అంతా అల్లాహ్ ఒక్కడి కొరకే. ఆయన కాకుండా సృష్టించేవాడు ఇంకొకడు ఎవరుంటారు ?. ఆజ్ఞాపన ఆయన ఒక్కడి కొరకే. ఆయన మేలు చాలా ఉన్నది. ఆయన ఉపకారములు ఎక్కువే. ఆయన ఘనత,పరిపూర్ణత లక్షణాలు కల సర్వలోకాల ప్రభువు.