అల్-ముఖ్తసర్
وَٱلسَّـٰبِقُونَ ٱلْأَوَّلُونَ مِنَ ٱلْمُهَـٰجِرِينَ وَٱلْأَنصَارِ وَٱلَّذِينَ ٱتَّبَعُوهُم بِإِحْسَـٰنٍ رَّضِىَ ٱللَّهُ عَنْهُمْ وَرَضُوا۟ عَنْهُ وَأَعَدَّ لَهُمْ جَنَّـٰتٍ تَجْرِى تَحْتَهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَآ أَبَدًا ۚ ذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ ﴿١٠٠﴾
తమ ఇండ్ల నుండి,తమ ప్రదేశముల నుండి అల్లాహ్ వైపునకు వలస వచ్చిన ముహాజిర్ల నుండి,ఆయన ప్రవక్తను సహాయపడిన అన్సారులలో నుండి ప్రప్రధమంగా విశ్వాసమును కనబరచిన వారు,మరియు ప్రప్రధమంగా విశ్వాసమును కనబరచిన ముహాజిర్లను,అన్సారులను విశ్వాసములో,మాటల్లో,ఆచరణల్లో ఉత్తమంగా అనుసరించిన వారందరి నుండి అల్లాహ్ ప్రసన్నుడై వారి విధేయతను స్వీకరించాడు.వారందరు కూడా వారికి ఆయన ప్రసాదించిన గొప్ప పుణ్యము వలన,మరియు వారి కొరకు సిద్ధం చేసి ఉంచిన ఆ స్వర్గ వనాలు వేటి భవనాల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయో వాటిలో వారు ఎల్లవేళలా ఉంటారో వాటి వలన ఆయనతో (అల్లాహ్) సంతుష్టపడ్డారు.ఈ ప్రతిఫలమే గొప్ప సాఫల్యము.